కాటారం: మహాముత్తారం మండలంలోని దొబ్బలపాడు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి, దూషించిన (ఔట్ సోర్సింగ్ ఉద్యోగి) వ్యాయామ ఉపాధ్యాయుడు మంతెన భాను ప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల అదనపు డైరెక్టర్ శ్రీనివాసచారి ఆదేశాలు జారీచేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రవి గురువారం తెలిపారు. గతనెల 26న పీఈటీ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులను సీఎం కప్ క్రీడా పోటీల కోసం హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఇదే క్రమంలో మద్యం సేవించి విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దూషించాడు. దీంతో ఇంటికి తిరిగి వచ్చిన సదరు విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం వివరించి మోడల్ పాఠశాల అడిషనల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండల అధికారులతో విచారణ జరిపించిన ఏడీ వారి నివేదిక ప్రకారం పీఈటీని ఉద్యోగం నుంచి తొలిగించారు.
Comments
Please login to add a commentAdd a comment