భూపాలపల్లి అర్బన్: ప్రమోషన్ల పేరుతో సింగరేణి అధికారులు కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రెండేళ్ల క్రితం రద్దు చేసిన ప్రమోషన్లను మళ్లీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం సరికాదని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు సంవత్సరాల క్రితం వివిధ గనుల్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సింగరేణి కార్మికులకు వివిధ కేటగిరీల్లో పని చేసినప్పటికీ ఆ యాక్టింగులు చేస్తున్న వారికి ఇష్టం లేకపోయినా లైన్‌మెన్, కోల్‌కట్టర్ ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. వాటిని రద్దు చేయాలని అప్పటి జీఎంపై ఓత్తిడి తీసుకురాగా ప్రమోషన్ల ఉత్తర్వులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుత ఏరియా జనరల్ మేనేజర్ గత రెండు సంవత్సరాల క్రితం రద్దయిన ప్రమోషన్లను బలవంతంగా కార్మికులకు ఇవ్వాలని వివిధ గనుల మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. అధికారులు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నీరాటి రాజన్న, జైపాల్ సింగ్, కాసర్ల ప్రసాద్ రెడ్డి, దాసరి జనార్ధన్, నామాల శ్రీనివాస్, శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment