విద్యుత్ ప్లాంట్లకు భూముల గుర్తింపు
భూపాలపల్లి: సౌర శక్తి విద్యుత్ ప్లాంట్స్ ఏర్పాటుకు భూములను గుర్తించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, విద్యుత్, డీఆర్‌డీఏ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ, విద్యుత్, డీఆర్‌డీఏ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున 17వ తేదీ లోపు పూర్తి నివేదికలు అందించాలని తహసీల్దార్లను ఆదేశించారు.
మహిళా సాధికారతే లక్ష్యం..
మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టువిక్రమార్క అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాలు అందించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 28 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు. నిర్ధేశించిన గడువులోగా 122 ఎకరాలు గుర్తించి నివేదికలు అందజేస్తామని అన్నారు.
దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
భూ మాతతో సమస్యల పరిష్కారం
రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టిందని, రైతులు, భూ యజమానుల హక్కుల రక్షణ, భద్రతతోపాటు పలు రకాల సహాయ సహకారాలు అందించేలా భూ భారతి బిల్లును అమల్లోకి తేనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో తెలంగాణ భూ భారతి చట్టంపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ మంగిలాల్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మల్చూర్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.
భూ భారతితో భూ వివాదాలు పరిష్కారం
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment