ఆర్డీఓగా రవి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్డీఓగా ఎన్.రవిని బదిలీ చేస్తూ బుధవారం భూ పరిపాలన శాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి ఆర్డీఓగా పని చేస్తున్న మంగీలాల్‌ను హనుమకొండకు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో హనుమకొండ ఆర్డీఓను భూపాలపల్లికి బదిలీ చేశారు.
పుష్కరాలు,
కుంభాభిషేకంపై సమీక్ష
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో నిర్వహించే కుంభాభిషేకం, సరస్వతినది పుష్కరాలపై దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్ అధ్యక్షతన 10న శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మారుతి బుధవారం తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి క్షేత్రస్థాయిలో కాళేశ్వరం దేవస్థానాన్ని సందర్శించి సమీక్షలో పాల్గొంటారని తెలిపారు. ఫిబ్రవరిలో జరుగు మహాశివరాత్రికి ముందే శృంగేరి పీఠాధిపతి, అతని శిష్య బృందంతో కుంభాభిషేకం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మే 15న జరిగే సరస్వతి నది పుష్కరాల ఏర్పాట్లపై చర్చించి ప్రణాళికలు చేయనున్నారు.
ట్రెస డైరీ, క్యాలెండర్
ఆవిష్కరణ
భూపాలపల్లి: ఐడీఓసీ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ రాహుల్ శర్మ తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్(ట్రెస) డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్డీఓ మంగీలాల్, కలెక్టరేట్ ఏఓ ఖాజా మోయినొద్దీన్, ట్రెస జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
పంపిణీకి సిద్ధంగా ట్రై సైకిళ్లు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో ట్రై సైకిల్స్ కావాల్సిన దివ్యాంగులు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులకు పంపిణీ చేయడానికి 11 (ట్రై సైకిళ్లు) మూడు చక్రాల సైకిళ్లు సిద్ధంగా ఉన్నాయని, దరఖాస్తులు చేసుకున్న వారి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇతర వివరాల కోసం 96523 11804 ఫోన్ నంబర్ ద్వారా సంప్రందించాలని ఆయన సూచించారు.
‘నా గ్రామం.. నా బాధ్యత’ నినాదంతో పనిచేయాలి
కాటారం: ప్రతి పౌరుడు ‘నా గ్రామం.. నా బాధ్యత’ అనే నినాదంతో పని చేయాలని నీతి ఆయోగ్ ప్రతినిధి సారా కోస్లా, స్వయంకృషి ఫౌండర్ కొట్టే సతీశ్ అన్నారు. కాటారం గ్రామ పంచాయతీ పరిధిలో నీతి ఆయోగ్ టీం, స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన నా గ్రామం.. నా బాధ్యత అనే కార్యక్రమంలో కొట్టే సతీశ్, సారా కోస్లా మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన విధానం, విద్య, వైద్య పరంగా ప్రజలు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారంపై అవగామన కల్పించారు. కార్యక్రమంలో పిరమిల్ –నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం సభ్యులు తిరుమల్, బాకీయమన్, భానుప్రకాశ్, స్వయంకృషి సభ్యులు సుమన్, సాయితేజ, హైమద్, బబ్లు, వినయ్‌రావు, బాలరాజ్, సాయి, రవి, శేఖర్, ప్రశాంత్, అంకుశ్, ఆరిఫ్ పాల్గొన్నారు.
గట్టమ్మ హుండీల లెక్కింపు
ములుగు రూరల్: జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయ హుండీల లెక్కింపు ప్రక్రియను దేవాదాయశాఖ అధికారులు బుధవారం చేపట్టారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఈఓ బిళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గట్టమ్మ హుండీల ద్వారా ఆదాయం రూ.1,93,838 వచ్చిందని తెలిపారు. ఇందులో రూ.1,81,555 నోట్ల రూపంలో లభించగా రూ.12,283 నాణాల రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకులు కవిత, పూజారులు కొత్త లక్ష్మయ్య, ఆర్‌ఐ యుగేంధర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment