ఉద్యోగం కన్నా వ్యవసాయం మిన్న..
టేకుమట్ల: ఉద్యోగం కంటే వ్యవసాయం బెటర్ అంటున్నారు టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన ఒజ్జల కిరణ్. బీ ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగంపై ఆసక్తి లేక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నారు. పత్తి, మిరప పంటలతోపాటు టమాట, వంకాయ, బెండకాయ, అల్చింత, పాలకూర, ఉల్లిగడ్డ, కాకరకాయ, సొరకాయ వంటి తదితర రకాల కూరగాయలను సాగు చేస్తూ అఽధిక లాభాలను గడిస్తున్నారు. ‘నాకున్న మూడెకరాల భూమిలో రెండు ఎకరాల్లో పత్తి, మిరప పంటలతో పాటు, ఎకరం భూమిలో వివిధ రకాల కూరగాయలను పండిస్తున్నా. ఉద్యోగం చేస్తే తీవ్ర మానసిక ఒత్తిడితో సమయమూ ఎక్కువగా కేటాయించాలి. అదే సొంతంగా వ్యవసాయం చేస్తే లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.’ అని కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment