సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం
● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
రేగొండ: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. రూ.5 లక్షలతో నిర్మించనున్న ఇందిరమ్మ నమునా ఇంటి నిర్మాణ పనులకు శనివారం మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేవలం ఇరవై రోజుల్లోనే అన్ని హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, పీఏసీఎస్ చైర్మన్ నడిపల్లి వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సాయిని విజయ, ఆర్‌ఐ నరేష్‌కుమార్ జిల్లా, మండల నాయకులు నాయిని సంపత్‌రావు, పున్నం రవి, సూదనబోయిన ఓంప్రకాశ్, ముల్కనూరి భిక్షపతి, వీరబ్రహ్మం, మల్లారెడ్డి, విజేందర్, రమణారెడ్డి, వెంకటస్వామి, దేవేందర్, చందు, క్రాంతి, భాస్కర్, సురేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment