ఆదివారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2025
గానుగ నూనె..ప్రకృతి సిద్ధం..
భూపాలపల్లి రూరల్: ఆముదాలపల్లికి చెందిన భౌతు రాజు, అశ్విని దంపతులు డిగ్రీ వరకు చదువుకున్నారు. ఎద్దులతో గానుగ నూనె తయారీ యూనిట్ ఏర్పాటుచేసి స్వచ్ఛమైన పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఇప్పనూనె తయారు చేస్తున్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా రవాణా చేస్తుండగా, దూర ప్రాంతాల వారికి ఆర్టీసీ కార్గోద్వారా అందిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ.30వేల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిపారు. మొదట్లో రూ.3లక్షల వరకు అప్పు తీసుకువచ్చి చెక్క గానుగ తయారు చేయించానని, కర్ణాటక, జహీరాబాద్, వరంగల్‌నుంచి ముడిసరుకును తీసుకువచ్చి తెచ్చి గానుగ నూనె తయారు చేస్తున్నట్లు రాజు ‘సాక్షి’కి తెలిపారు.
‘బలమే జీవనం.. బలహీనతే మరణం. సమస్త శక్తి నీలో ఉంది.. లక్ష్య సాధనలో వంద నరకాలైన అనుభవించేందుకు సిద్ధంగా ఉండు..కానీ విజయాన్ని సాధించే దాకా విడిచిపెట్టకు’ అన్న స్వామి వివేకానంద మాటలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివిన యువత.. ఉద్యోగం రావడం లేదని ఎదురుచూడకుండా తమకు నచ్చిన, వచ్చిన రంగంలో రాణిస్తున్నారు. తమలో ఉన్న ప్రతిభకు పదును పెట్టి కొత్త ఆవిష్కరణలు రూపొందిస్తున్న వారు కొందరైతే.. ఎవరికింద పనిచేయడమేంటీ.. మనమే నలుగురికి ఉపాధి కల్పిద్దామని వ్యవసాయం, ఇతర స్వయం ఉపాధి రంగాల్లో దూసుకెళ్తున్న వారు మరికొందరు. నేడు(ఆదివారం) జాతీయ యువజన దినోత్సవం(వివేకానంద జయంతి) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతపై ప్రత్యేక కథనం.
పాడి గేదెలకు మేత వేస్తున్న శ్రీనివాసు
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment