తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ | Sakshi
Sakshi News home page

తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ

Published Wed, Apr 17 2024 1:45 AM

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌  - Sakshi

గద్వాల రూరల్‌: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులును ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌ హాలులో తాగునీటి సరఫరాపై మున్సిపాలిటీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే రెండు నెలల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. నీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా పర్యవేక్షించాలన్నారు. ప్రతివార్డులోని ఇంటికి మిషన్‌భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. అవసరం మేరకు స్థానికంగా ఉండే చేతిపంపులు, బోరుమోటార్లకు మరమ్మతులు చేయించాలన్నారు. అదేవిధంగా ఇదివరకే రూపొందించిన సమ్మర్‌యాక్షన్‌ ప్లాన్‌పై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌చౌహాన్‌, ఈఈ భీమేశ్వర్‌రావు డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

ఆదర్శ పాఠశాలలో...

మ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన మరమ్మతు పనులు వేగవంతం చేసి జూన్‌ మొదటివారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 460 ప్రభుత్వ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు చదువుకునేలా సుందరీకరంగా పనులు పూర్తి చేయాలన్నారు. జూన్‌ మొదటి వారంలో ‘మన ఊరు– మన బడి’ కింద 160 పాఠశాలల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా తగరతి గదులు, తాగునీటి, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలన్నారు. డీఆర్‌డీఓ నర్సింగ్‌రావు, పీఆర్‌ ఈఈ విజయ్‌కుమార్‌, మిషన్‌భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఎంపీడీఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement