ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈ
ఎర్రవల్లి: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఓ పంచాయతీరాజ్ ఏఈ సోమవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీ గార్లపాడులో రూ.25 లక్షల వ్యయంతో ఓ కాంట్రాక్టర్ మైనారిటీ కమ్యూనిటీ భవనం (షాదీఖానా)ను నిర్మించి బిల్లు కోసం ఎంబీ రికార్డుల్లో నమోదు చేయాలని పంచాయతీరాజ్ ఏఈ పాండురంగారావును ఇటీవల సంప్రదించాడు. ఈ క్రమంలో తనకు కాంట్రాక్ట్ బడ్జెట్ ప్రకారం 2 శాతం కమీషన్‌గా రూ.లక్ష ఇస్తేనే ఎంబీలో బిల్లు ఎక్కిస్తానని తేల్చి చెప్పాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏఈతో చర్చలు జరిపి చివరికి రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం సోమవారం ఉదయం బాధితుడు ఎర్రవల్లి కూడలిలోని జమ్‌జమ్ హోంనీడ్స్ దుకాణంలో ఏఈకి నగదు డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఈ నుంచి వివరాలు సేకరించి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. ఏసీబీ దాడుల్లో సీఐలు లింగస్వామి, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.
● ఎంబీ రికార్డు చేసేందుకు
రూ.50 వేలు డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment