జడ్చర్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పుష్పలత
జడ్చర్ల: మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన కోనేటి పుష్పలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్‌కు చెందిన చైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మిపై సొంత పార్టీ సభ్యులే అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దింపిన తర్వాత తదుపరి చైర్‌పర్సన్ ఎవరా అంటూ దాదాపు మూడు నెలల పాటు చర్చలు కొనసాగాయి. చివరికి చైర్‌పర్సన్‌గా పుష్పలత ఏకగ్రీవం కావడంతో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. అయితే మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నిలుపుకోగలిగింది.
ప్రశాంతంగా ఎన్నిక..
మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించారు. నిర్ణీత సమయానికి క్యాంపు నుంచి బయలుదేరిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లతోపాటు మాజీ చైర్‌పర్సన్ లక్ష్మి సైతం ఎన్నికకు హాజరయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ నవీన్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి ఎన్నికను నిబంధనల మేరకు నిర్వహించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 14వ వార్డు కౌన్సిలర్ కోనేటి పుష్పలతను చైర్‌పర్సన్ అభ్యర్థిగా 26వ వార్డు కౌన్సిలర్ శశికిరణ్ ప్రతిపాదించగా 9వ వార్డు సభ్యురాలు చైతన్య బలపరిచారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా కోనేటీ పుష్పలతను బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 26 మంది సభ్యులు ఆమోదించడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ నవీన్‌కుమార్ ప్రకటించి ధ్రువీకరించారు.
పుర పీఠాన్ని నిలుపుకొన్న
బీఆర్‌ఎస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment