పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
ఎర్రవల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా పౌర సరఫరా అధికారి స్వామి కుమార్ అన్నారు. సోమవారం ఎర్రవల్లి మండల పరిదిలోని కొండేరులో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు తేమ శాతాన్ని తనిఖీ చేయడంతో పాటు తాలు, మట్టి పెల్లలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకానికి రూ. 2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరను అందించడంతోపాటుగా సన్న రకాలకు బోనస్‌గా మరో రూ.500 వరకు ఇవ్వనున్నట్లు వివరాలు తెలిపేలా కొనుగోలు కేంద్రం వద్ద చార్ట్‌ను రూపొందించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలలో తప్పనిసరిగా ప్యాడీ క్లీనర్, గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు తప్పకుండా అందుబాటులో ఉంచాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను ఓపీఎంఎస్‌లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ ప్రవళిక, సిసి బీచుపల్లి, ఐకేసి సిబ్బంది, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment