జీజీహెచ్‌లో కంప్లైంట్ బాక్సుల ఏర్పాటు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో రోగులు, వారి బంధువుల ఫిర్యాదుల స్వీకరణ కోసం వివిధ వార్డుల ఆవరణల్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రోగులు తమ సమస్యలతో పాటు, ఎవరైనా లంచాలు అడిగినా తమ ఫిర్యాదులను పెట్టెలో వేయవచ్చన్నారు. అలాగే మహాప్రస్థానం సేవలు కావలసిన వారు 98490 31316 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.
కిక్కిరిసిన అప్పనపల్లి
మామిడికుదురు: దసరా సెలవులు కావడంతో అప్పనపల్లి శ్రీబాల బాలాజీస్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు దీరిన శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారి సన్నిధిలో లక్ష్మీ నారాయణ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2.73 లక్ష ల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. లడ్డూ ప్రసాదం, ద ర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.14 లక్షలు సమకూరారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 59,299 విరాళాలు వచ్చాయి. 4,686 మంది భ క్తులు స్వామి వారిని దర్శించుకోగా, 3,578 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.
సర్టిఫికెట్లు పోతే ఇలా చేయండి
అమలాపురం టౌన్: జిల్లాలో రెండు నెలల్లో కురిసిన వర్షాలు, సంభవించిన వరదలకు కొ న్ని ప్రాంతాల ఇంటర్ విద్యార్థులు సర్టిఫికెట్లు పోగొట్టుకున్నట్లు ఇంటర్ విద్యా మండలి దృష్టికి వచ్చిందని డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (డీఐఈఓ) వనుము సోమశేఖరరావు తెలిపారు. అలాంటి విద్యార్థులు ఎవరైనా సర్టిఫికెట్లు పోగొట్టుకుంటే వారి ఆధా ర్ కార్డు నకలు, సంబంధిత సర్టిఫికెట్ నంబర్ తదితర వివరాలతో ఒక దరఖాస్తును డీఐఈఓ కు గాని లేదా ఇంటర్ బోర్డు ప్రాంతీయ విద్యా అధికారికి గాని సమర్పించాలని సూచించారు. ఇందుకు ఏ విధమైన రుసుము లేకుండా ఉచితంగా బాధిత విద్యార్థులకు డూప్లికేట్ సర్టిఫికెట్లు అందజేస్తారని ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలిపిందని ఆయన వివరించారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
ఐ.పోలవరం : పచ్చని కోనసీమలో బతుకమ్మ సంబరాలు అలరించాయి. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని పాడుతూ యువతులు సందడి చేశారు. ఐ.పోలవరం మండలం మురమళ్లలోని అప్పన్నచెరువు గట్టు వద్ద వేంచేసి ఉన్న విజయదుర్గమ్మ దసరా మహోత్సవాల సందర్భంగా శనివారం రాత్రి బతుకమ్మలను అమ్మవారి వద్ద ఉంచి ఆడిపాడారు. సంప్రదాయ దుస్తుల్లో రంగుల బతుకమ్మలతో సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment