మా గ్రామంలో ప్రైవేటు కళాశాలకు సిమెంటు రోడ్డు నిర్మించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకపోయినా పనులు చేపట్టారు. ప్రజాధనం దుర్వినియోగానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.
– బెజవాడ సత్యనారాయణ,
సర్పంచ్, తిమ్మాపురం
రోడ్డు నిర్మాణంలో
అవకతవకలు
తిమ్మాపురంలో సుమారు రూ.77.5 లక్షల ఉపాధి హామీ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. జనావాసాలు లేకపోయినా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు బయటి నుంచి ప్లాంట్ కాంక్రీటు తీసుకువచ్చారు. ప్లాంట్ కాంక్రీట్లో 20 ఎంఎం కంకర ఉండదు. దీనివలన రోడ్డు త్వరగా ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి.
– కాళ్ళ ధనరాజు,
బీజేపీ నాయకుడు, తిమ్మాపురం
Comments
Please login to add a commentAdd a comment