గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం
శంఖవరం: గిరిజన సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని ఆవెల్లి, అనుమర్తి, ఓండ్రేగుల గిరిజన గ్రామాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో సమస్యలను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయో లేదో ఆరా తీశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్థానిక గిరిజనులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీటిని తక్షణం పరిష్కరించాలని స్థానిక అధికారులను శంకర్ నాయక్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పోతురాజు, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment