కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు

Published Tue, May 7 2024 11:05 AM

కాంగ్

నిజాంసాగర్‌(జుక్కల్‌): బిచ్కుంద, నిజాంసాగర్‌ మండలాలకు చెందిన మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నేతలు సోమవారం జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బిచ్కుంద మండలం శాంతాపూర్‌ మాజీ సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డితో పాటు 200 మంది బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్నారు. అలాగే ఒడ్డేపల్లి, మల్లూర్‌ గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

గర్గుల్‌కు చెందిన పలువురి చేరిక

కామారెడ్డి రూరల్‌: గర్గుల్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ యువజన విభాగం గ్రామ అధ్యక్షుడు సంతోష్‌, మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు యూనుస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల మహిళా అధ్యక్షులు ఉమారాణి, మాజీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మండల పార్టీ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, చింతల రవితేజగౌడ్‌, కుమార్‌గౌడ్‌, శంకర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు
1/1

కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు

Advertisement
 
Advertisement