పాలనలో సంగ్వాన్‌ మార్క్‌! | - | Sakshi
Sakshi News home page

పాలనలో సంగ్వాన్‌ మార్క్‌!

Published Sat, Sep 28 2024 2:28 AM | Last Updated on Sat, Sep 28 2024 2:28 AM

పాలనల

ప్రజావాణిపై ఎప్పటికప్పుడు ఆదేశాలు..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి కలెక్టర్‌గా ఆశిష్‌ సంగ్వాన్‌ జూన్‌ 16న బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిర్మల్‌నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన మూడో రోజునుంచే జిల్లాలో పర్యటనలు షురూ చేశారు. మూడున్నర నెలల్లో దాదాపు జిల్లాను చుట్టివచ్చారు. రోజూ మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత కార్యాలయానికి చేరుకుని సమీక్షలు నిర్వహిస్తూ, ఫైల్స్‌ క్లియర్‌ చేయడంపై దృష్టిపెడుతున్నారు. ధరణికి సంబంధించి పెండింగ్‌ ఫైల్స్‌ క్లియరెన్స్‌పై ఫోకస్‌ చేస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా క్యాంప్‌ కార్యాలయానికి అధికారులను పిలిపించి పెండింగ్‌లో ఉన్న ధరణి ఫైల్స్‌ను క్లియర్‌ చేయడం ద్వారా ఫిర్యాదులను తగ్గించడానికి కృషి చేస్తున్నారు. అలాగే బాధ్యతగా పనిచేసే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారు. విధులలో నిర్లక్ష్యంగా ఉండేవారికి, సరైన సమాచారం లేకుండా సమావేశాలకు వచ్చేవారికి క్లాస్‌ తీసుకుంటూ వారు పనితీరు మెరుగుపరచుకునేలా చూస్తున్నారు.

ప్రభుత్వ శాఖల్లో ఈ–ఫైలింగ్‌ విధానం

ప్రభుత్వ శాఖల్లో ఈ–ఫైలింగ్‌ విధానం అమలుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. రెవెన్యూ, హెల్త్‌, పౌరసంబంధాలు తదితర శాఖల్లో ప్రతీది ఈ–ఫైలింగ్‌ ద్వారానే జరుగుతోంది. రోజూ కలెక్టర్‌ ఆన్‌లైన్‌లో ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఈ విధానం అన్ని శాఖల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫైల్స్‌ పట్టుకుని తిరిగేకన్నా ఈ–ఫైల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పెడితే సకాలంలో వాటిని చూసి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్‌ చెబుతున్నారు. అన్ని శాఖల్లోనూ ఈ–ఫైలింగ్‌ అమలయ్యేలా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా కలెక్టర్‌గా ఆశిష్‌ సంగ్వాన్‌ బాధ్యతలు స్వీకరించి వంద రోజులు గడిచాయి. తక్కువ కాలంలోనే ఆయన జిల్లా పాలనపై తనదైన ముద్ర వేశారు. నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూనే.. క్షేత్రస్థాయి పర్యటనలూ చేస్తున్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించేలా చూసేందుకు కలెక్టరేట్‌లో బయోమెట్రిక్‌ హాజరు విధానం పకడ్బందీగా అమలయ్యేలా చూస్తున్నారు. బాధ్యతగా పనిచేసే అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తూ.. విధులలో నిర్లక్ష్యంగా ఉండేవారికి క్లాస్‌ తీసుకుంటూ మార్పుకోసం కృషి చేస్తున్నారు.

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడున్నర నెలలు

రోజూ క్షేత్రస్థాయి పర్యటనలు..

క్రమం తప్పకుండా సమీక్షలు

ప్రజావాణిలో జూమ్‌ మీటింగ్‌ ద్వారా

మండల అధికారులకు ఆదేశాలు

అమలులోకి ఈ–ఫైలింగ్‌ విధానం

కలెక్టరేట్‌లో పకడ్బందీగా బయోమెట్రిక్‌ హాజరు..

సకాలంలో విధులకు వస్తున్న ఉద్యోగులు

కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఆశిష్‌ సంగ్వాన్‌ ప్రజావాణికి తప్పనిసరిగా హాజరవుతున్నారు. గతంలో జిల్లా స్థాయి అధికారులు కొంద రు డుమ్మాకొట్వేఆరు. కానీ ఆశిష్‌ సంగ్వాన్‌ ఆదేశాలతో అన్ని శాఖల అఽధికారులు ప్రజావాణిలో భాగమవుతున్నారు. ఆశిష్‌ సంగ్వాన్‌ జిల్లా కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజావాణి లో జూమ్‌ విధానం అమలు చేశారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులు సోమవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసేదాకా కచ్చితంగా జూమ్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయా మండలాల్లో తహసీ ల్‌ కార్యాలయాల నుంచి తహసీల్దార్‌, ఎంపీడీవో తో పాటు ఇతర శాఖల అధికారులు జూమ్‌లో పాల్గొంటారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వచ్చి వినతులను చదివి.. ఒకవేళ మండల స్థాయిలో పరిష్కరించగలిగే సమస్య అయితే సంబంధిత మండల అధికారులతో కలెక్టర్‌ జూమ్‌ ద్వారా అనుసంధానం అవుతారు. సమస్యను వి వరించి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారో చెప్పాలని సంబంధిత మండల అధికారిని ప్రశ్నిస్తారు. దీంతో ప్రజావాణి సమస్యలు త్వరగా పరిష్కారానికి నోచుకుంటున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాలనలో సంగ్వాన్‌ మార్క్‌!1
1/2

పాలనలో సంగ్వాన్‌ మార్క్‌!

పాలనలో సంగ్వాన్‌ మార్క్‌!2
2/2

పాలనలో సంగ్వాన్‌ మార్క్‌!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement