లింగంపేట ఆదర్శంగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

లింగంపేట ఆదర్శంగా నిలవాలి

Published Sat, Sep 28 2024 2:30 AM | Last Updated on Sat, Sep 28 2024 2:30 AM

లింగం

లింగంపేట(ఎల్లారెడ్డి) : నాగన్నగారి మెట్లబావి లింగంపేటకు చిహ్నమని, జిల్లాకు ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. గ్రామంలోని రామాలయం, ఊగే ధ్వజస్తంభాన్ని అభివృద్ధి చేస్తామని, చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండల కేంద్రంలోని నాగన్నగారి మెట్ల బావి వద్ద లింగంపేట ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణం, పచ్చదనం ప్రతిబింబించేలా విద్యార్థులు వేసిన చిత్రాలను తిలకించడంతోపాటు మహిళా సంఘాల సభ్యుల స్వగృహ ఫుడ్స్‌ స్టాల్‌ను పరిశీలించారు. పిండి వంటల రుచి చూసి బాగున్నాయని మహిళలను అభినందించారు. స్వగృహ ఫుడ్స్‌స్టాల్‌ను లింగంపేటలో ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పర్యాటక దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ నాగన్నగారి బావి వద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఫ్రూట్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థిక వనరులు చేకూరుతాయన్నారు. బావి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. బావి సందర్శనకు రూ.10, ఫొటో, వీడియో షూట్‌కు రూ.500 వసూలు చేసేలా ఏర్పాటు చేశామని, ఆ డబ్బులతో బావిని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్‌, ఆర్డీవో ప్రభాకర్‌, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, తహసీల్దార్‌ నరేందర్‌గౌడ్‌, ఎంపీడీవో నరేశ్‌, ఎంపీవో మల్హారి, ఎంఈవో షౌకత్‌, ఏపీఎం శ్రీనివాస్‌, ఆయా గ్రామాల కార్యదర్శులు, అధికారులు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చారిత్రక కట్టడాలను కాపాడుకోవాలి

నాగన్నగారి బావితో గుర్తింపు..

రామాలయం, ఊగే ధ్వజస్తంభాన్ని అభివృద్ధి చేస్తాం

పర్యాటక దినోత్సవంలో

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
లింగంపేట ఆదర్శంగా నిలవాలి1
1/1

లింగంపేట ఆదర్శంగా నిలవాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement