సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Published Sat, Sep 28 2024 2:32 AM | Last Updated on Sat, Sep 28 2024 2:32 AM

సీఎంఆ

నిజామాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని సీఎంఆర్‌ షాపింగ్‌మాల్‌ను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, మేయర్‌ నీతూకిరణ్‌ శుక్రవారం ప్రారంభించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తున్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటి పాయల్‌రాజ్‌పుత్‌, హీరో రామ్‌ పోతినేని షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. దీంతో అభిమానులు, కొనుగోలుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సినీ నటి పాయల్‌రాజ్‌పుత్‌ పలు వస్త్రాభరణాలను పరిశీలించి, ప్రదర్శించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్‌ ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై సినీ నటి చేసిన డ్యాన్స్‌ ఆకట్టుకుంది.సినీతారలను చూసేందుకు జిల్లా ప్రజ లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ యజమాని వెంకటరమణ, కార్పొరేటర్‌ హేమలత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బస్వాలక్ష్మీనర్సయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం 1
1/2

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం 2
2/2

సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement