సోమేశ్వర్‌లో పేలిన సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వర్‌లో పేలిన సిలిండర్‌

Published Sat, Sep 28 2024 2:32 AM | Last Updated on Sat, Sep 28 2024 2:32 AM

-

బాన్సువాడ రూరల్‌: మండలంలోని సోమేశ్వర్‌లో శుక్రవారం ఓఇంట్లో ప్రమాదవశాత్తు వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. గ్రామానికి చెందిన కమలవ్వ తిమ్మప్పలకు చెందిన రేకుల ఇంట్లో సిలిండర్‌ పేలడంతో వంటసామగ్రి, బియ్యం, దుస్తులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫైర్‌సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష

ఖలీల్‌వాడి: మద్యం తాగి రోడ్డుపై న్యూసెన్స్‌ చేసిన ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు ఎస్సై మహేశ్‌ శుక్రవారం తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మూడో పీఎస్‌ పరిధిలోని దుబ్బకు చెందిన రాచకొండ శ్రీకాంత్‌, కంఠేశ్వర్‌కు చెందిన డెక్కా రవికుమార్‌ మూడో టౌన్‌ పరిధిలో ఈ నెల 26న రాత్రి 10 గంటల ప్రాంతంలో మద్యం సేవించి న్యూసెన్స్‌ చేయగా ఇద్దరిపై సిటీ పోలీస్‌యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి సెకండ్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ దగ్గర హాజరు పర్చినట్లు చెప్పారు. దీంతో ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ తీర్పు వెలువరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దాడి చేసిన వారిపై కేసు నమోదు

సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్‌ గ్రామానికి చెందిన రవితేజ అనే యువకుడిపై దాడి చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎల్‌ రామ్‌ శుక్రవారం తెలిపారు. వినాయక నిమజ్జనం సమయంలో రవితేజకు అదే గ్రామానికి చెందిన అఖిలేష్‌ అనే వ్యక్తి నాన్నతో గొడవ జరిగింది. ఆ గొడవను దృష్టిలో పెట్టుకొని అఖిలేష్‌ తన స్నేహితులైన కుషాల్‌, దీపక్‌, నితిన్‌తో కలిసి రవితేజపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అఖిలేష్‌ అతని స్నేహితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement