మీ త్యాగం అమరం | - | Sakshi
Sakshi News home page

మీ త్యాగం అమరం

Published Mon, Oct 21 2024 2:12 AM | Last Updated on Mon, Oct 21 2024 2:12 AM

మీ త్

కామారెడ్డి క్రైం: విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఆ శాఖ ఆధ్వర్యంలో నేడు(సోమవారం) అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించనున్నారు. ఒకప్పుడు పూర్తిగా నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎప్పుడు ఎక్కడ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంటుందో తెలియని పరిస్థితి ఉండేది. నక్సలైట్ల సమాచారం అందగానే విరుచుకుపడేందుకు పోలీసు బలగాలు సిద్ధంగా ఉండేవి. పోలీసులు వచ్చే దారుల్లో మందుపాతరలు పేల్చేందుకు నక్సల్స్‌ సిద్ధపడేవారు.

అప్పట్లో అనేక ఘటనలు..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 1980 దశకంలో మొ దలైన పీపుల్స్‌ వార్‌ కార్యకలాపాలు దాదాపు మూ డు దశాబ్దాల పాటు విస్తృతంగా కొనసాగాయి. కా మారెడ్డి, ఎల్లారెడ్డి, సిర్నాపల్లి, సిరిసిల్లా దళాలు ఈ ప్రాంతంలో కార్యాకలపాలు కొనసాగించేవి. సిరికొండ, భీమ్‌గల్‌, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి, కమ్మర్‌పల్లి, జక్రాన్‌పల్లి, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, వర్ని ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో వారికి పట్టు ఉండేది. నక్సల్స్‌ గ్రామాలకు వచ్చి వె ళ్తుండే వారు. ఈ క్రమంలో అనేకసార్లు ఎన్‌కౌంట ర్లు, ఎదురుకాల్పులు జరిగేవి. రామారెడ్డి మండలం మద్దికుంట వద్ద అప్పట్లో సీఆర్‌పీఎఫ్‌ వ్యాన్‌ను న క్సల్స్‌ పేల్చేశారు. లింగంపేట మండలం బురుగి ద్ద, ఉగ్రవాయి, ఎల్లారెడ్డి మండలం అజామాబాద్‌, ఇందల్‌వాయి వద్ద జాతీయ రహదారిపై మందు పాతరలు పేల్చిన ఘనటలో పలువురు పోలీసులు మృతి చెందగా మరికొందరు గాయాలపాలయ్యా రు. నక్సల్స్‌ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గ్రామాలకు చెందిన వారు పోలీస్‌ శాఖలో పనిచేయాలంటేనే భయపడేవారు. అప్పటికే చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాసారు.

త్యాగాలు వెలకట్టలేనివి

పోలీసు అమరుల త్యాగా లు వెలకట్టలేనివి. గతంలో పోలీసులకు విధి నిర్వహణ లో అనేక సవాళ్లు, ఇబ్బందులు ఎదురయ్యేవి. ము ఖ్యంగా నక్సల్స్‌ కార్యకలాపాలను నిరోధించే సమయంలో ఎంతో మంది అ మరులయ్యారు. వారి త్యాగాల కారణంగానే ప్ర శాంతమైన వాతావరణం ఏర్పడింది. వారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుని మేం ముందుకు సాగుతున్నాం. వాళ్లను స్మరిస్తూ విధి నిర్వహణకు పునరంకితమవుతాం. – సింధుశర్మ, ఎస్పీ

అసువులు బాసిన పోలీసులు

సంస్మరణ వారోత్సవాల కార్యక్రమాలివే..

పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్క రించుకుని సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరులకు వందన సమర్పణ. పరేడ్‌, రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ఎస్పీ సింధు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. 21 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా ర్యా లీలు, రక్తదాన శిబిరాలు, ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘విచక్షణ తో కూడిన మొబైల్‌ వాడకం’ అంశంపై ఇంటర్‌ విద్యార్థులకు, ‘మత్తు పదార్థాల నిర్మూలనలో నా పాత్ర’ అంశంపై డిగ్రీ, ఆ పైస్థాయి విద్యార్థులకు 21 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ వ్యాసరచన పోటీలు ఉంటాయని వివరించా రు. అలాగే 3 నిమిషాల షార్ట్‌ వీడియోలు, 3 ఫొటోల విభాగంలో (పోలీసు సేవలు, విధుల కు సంబంధించి) పోటీలలోనూ విద్యార్థులు, యువత పాల్గొనాలని ఎస్పీ కోరారు.

పోలీసు అధికారులకు..

‘సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగు పర్చడంలో నా పాత్ర’ అనే అంశంపై ఏఎస్సై స్ధాయి అధికారి వరకు, ‘ధృడమైన శరీరంలో ధృఢమై న మనసు’ అనే అంశంపై ఎస్సై, ఆపై స్ధాయి అధికారులు 500 పదాలకు మించకుండా వ్యా సాలు రాసి పంపించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపిక చేస్తామని, పోలీసు శాఖ ప్రత్యేకంగా రూపొందించిన లింక్‌ ద్వారా పోటీల్లో పాల్గొనాలని సూచించారు.

గతంలో జిల్లాలో జోరుగా

నక్సల్స్‌ కార్యకలాపాలు

విధి నిర్వహణలో అసువులు బాసిన పలువురు పోలీసులు

నేడు పోలీసు అమరవీరుల

సంస్మరణ దినం

కామారెడ్డిలోని డ్రైవర్స్‌ కాలనీకి చెందిన కానిస్టేబుల్‌ ఖుత్బుద్దీన్‌ 1989 జనవరి 10న నిజామాబాద్‌ జిల్లా పల్లికొండలో నక్సల్స్‌ చేతిలో హతమయ్యారు.

1991ఆగస్టు 2న డిచ్‌పల్లిమండలం సుద్దులం వద్ద నక్సలైట్లు మందుపాతర పేల్చిన ఘటన లో ఎస్సై సత్తయ్య మరణించారు. ఇదే ఘట నలో బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌కు చెంది న కానిస్టేబుల్‌ సుబ్బారావు కన్ను మూశారు.

1992 ఏప్రిల్‌ 28న లింగంపేట మండలం బూ రుగిద్ద వద్ద నక్సల్స్‌ మందుపాతర పేల్చగా మద్నూరు చెందిన కానిస్టేబుల్‌ మారుతి మృతి చెందారు.

1994 డిసెంబర్‌ 30న గాంధారి ఎక్స్‌ రోడ్డు వద్ద సదాశివనగర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ ఆంజనేయులును నక్సల్స్‌ కాల్చిచంపారు.

1999 అక్టోబర్‌ 31న గాంధారిలో నిజామాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఎస్వీ కృష్ణారావుపై నక్సల్స్‌ కాల్పులు జరపడంతో మృతి.

మాచారెడ్డి మండలం బంజేపల్లికి చెందిన కానిస్టేబుల్‌ బానోత్‌ రాములు 2001 మే 3న సొంతూరుకురాగా నక్సల్స్‌ కాల్చిచంపారు. ఆయనను కాపాడేందుకు వెళ్లిన రాములు తమ్ముడు సంగ్యా కూడా నక్సల్స్‌ కాల్పుల్లో చనిపోయాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
మీ త్యాగం అమరం1
1/1

మీ త్యాగం అమరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement