వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Published Mon, Oct 21 2024 2:14 AM | Last Updated on Mon, Oct 21 2024 2:14 AM

వేర్వ

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం వేర్వేరు కారణలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వేధింపులు భరించలేక మహిళ, పెళ్లి కావడం లేదని యువకుడు, వ్యక్తిగత కారణాలతో వాగులో దూకి మరొకరు, రైలుకిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

నిజాంసాగర్‌: తాళికట్టిన భర్త తనువు చాలించగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ అతని వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్‌ మండలం కొడిచర గ్రా మానికి చెందిన కె స్వరూప(34)కు గాంధారి మండలం ముదెల్లి గ్రామానికి చెందిన మొగులయ్యతో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు అరుణ్‌సందేశ్‌, ఇషాంత్‌ ఉన్నారు. ఇషాంత్‌ గర్భంలో ఉన్నప్పుడు మొగులయ్య మృతిచెందా డు. భర్త మృతితో స్వరూప వ్యవసాయ కూలీ పను లు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. కూలీ పను లకు వెళ్తున్న సమయంలో మహమ్మద్‌నగర్‌ మండలంలోని తుంకిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి అరవింద్‌ అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడి సహ జీవనానికి దారితీసింది. అతని మాటలు నమ్మి స్వరూప ఇద్దరు పిల్లలతో కలిసి మహమ్మద్‌నగర్‌కు వచ్చి కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. అరుణ్‌సందేశ్‌ ఎల్లారెడ్డిలోని గురుకుల పాఠశాలలో ఆరోతరగతి చదువుతుండగా చిన్నకుమారుడు ఇషాంత్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల నుంచి అరవింద్‌ స్వరూపను బెల్ట్‌తో కొడుతున్నట్లు చిన్నకుమారుడు ఇషాంత్‌ పోలీసులకు తెలిపారు. అరవింద్‌ వేధింపులు తాళలేక స్వరూప ఉదయం చిన్న కుమారుడు ఇష్టాంత్‌కు అన్నం తినిపించి బయటకు పంపించింది. కొద్దిసేపటికి స్వరూప అద్దె ఇంట్లోని దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్వరూపకు పలుమార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో అరవింద్‌ ఇంటికి వచ్చి చూడగా ఆత్మహత్య చేసు కొని ఉండడంతో స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసు కొచ్చి అరుగుపై పడుకోబెట్టి అరవింద్‌ పారిపోయా డు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిజాంసాగర్‌ ఎస్సై సుధాకర్‌, బాన్సువాడ రూ రల్‌ సీఐ రాజేశ్‌, బాన్సువాడ టౌన్‌ సీఐ అశోక్‌తో పాటు పిట్లం, బీర్కూర్‌, జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌ మండలాల ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. స్వరూప మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. తమ కుమార్తె మృతికి బాధ్యుడిపై చర్యలు తీసుకొని ఇద్దరు పిల్లలకు న్యాయం చేయాలని ముదెల్లి, కొడిచెర గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేస్తామని స్థానికులు ముందుకు రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పెళ్లి కుదరడం లేదని యువకుడు..

భిక్కనూరు: పెళ్లి కుదరడం లేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాసుల సంతోష్‌ (26) వ్యవసాయం చేసుకుంటు జీవిస్త్నన్నాడు. కొంత కాలంగా పెళ్లి చేసుకునేందుకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాగా అవి సఫలం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి సోదరుడు సతీశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై పేర్కొన్నారు.

మారంపల్లిలో..

డొంకేశ్వర్‌: నందిపేట్‌ మండలం కుద్వాన్‌పూర్‌ గ్రామానికి చెందిన మేతరి అశోక్‌(40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అశోక్‌ తిరిగి రాలేదు. ఆదివారం డొంకేశ్వర్‌ మండల పరిధిలోని మారంపల్లి బ్రిడ్జి వాగు వద్ద స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మరణించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి..

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలోని సిర్నాపల్లి–ఉప్పల్‌వాయి ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఉప్పల్‌వాయి రైల్వే గేటు ప్రాంతంలో మృతదేహం ఉన్న ట్లు సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు తెలిపారు. మృతుడి వయస్సు 30–40ఏళ్ల మధ్య ఉంటుందని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712658591, 9493451642 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య1
1/1

వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement