ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌

Published Mon, Oct 21 2024 2:20 AM | Last Updated on Mon, Oct 21 2024 2:20 AM

ఆరోగ్

మద్నూర్‌(జుక్కల్‌): పీహెచ్‌సీలో కొనసాగుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెడుతోంది. ప్రభు త్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నప్పటికి సరైన అవగాహన లేక పలువురు ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల పాలై ఆర్థికంగా, ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డోంగ్లీ మండల కేంద్రంలో ప్రభు త్వం 2023 మార్చిలో ప్రారంభించింది. జిల్లాలో కేవలం కొన్ని పీహెచ్‌సీలలో మాత్రమే ఆరోగ్య మహిళ కా ర్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది. కార్యక్రమం ప్రారంభమైన 19 నెలల్లో 4,102 మంది మహిళలు సేవలు పొందినట్లు వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే ఇప్పటి వరకు 1,178 మంది మహిళలకు ల్యాబ్‌ టెస్ట్‌లు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం 90 మంది మహిళలకు ఇతర ఆస్పత్రులకు రిఫర్‌ చేసినట్లు వైద్యులు చెప్పారు. మారుమూల ప్రాంతమైన జుక్కల్‌ నియోజకవర్గంలో వైద్య సేవలు దొరక్క మహిళలు ఇబ్బందులు పడేవారు. పలువు రు మహిళలు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పురుషులైన వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి గతంలో ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి డోంగ్లీ పీహెచ్‌సీలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఉంటుంది. మహిళా వై ద్య నిపుణుల పర్యవేక్షణలో అనారోగ్యం బారిన ప డిన మహిళలకు బీపీ, షుగర్‌, రొమ్ము, నోటి, సర్వైకల్‌ క్యాన్సర్‌, నెలసరి, థైరాయిడ్‌, మూత్రకోశ సంబంధిత తదితర పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వైద్య పరీక్షల అనంతరం సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు.

ప్రతి మంగళవారం పీహెచ్‌సీలో సేవలు

19 నెలల్లో 4,102 మందికి పరీక్షలు

ప్రతి మంగళవారం పరీక్షలు

ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా పీహెచ్‌సీలో ప్రతి మంగళవారం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మ హిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. అవసరమైతే మె రుగైన వైద్య సేవల కోసం జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నాం. మహిళలు ప్రభుత్వ ఆస్పత్రిలో అందుతున్న నాణ్యమైన, ఉచిత సేవలను వినియోగించుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

– శ్రీలేఖ, వైద్యురాలు, డోంగ్లీ

వైద్య సేవలు బాగున్నాయి

ఆరోగ్య మహిళ పేరుతో ఆస్పత్రిలో మహిళలకు ప్రత్యే కంగా వైద్య సేవలు అందించడం ఈ ప్రాంత మహిళల కు ఎంతో మేలు జరుగుతుంది. వైద్యం అందక ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పక్కన ఉన్న మహారాష్ట్రకు వెళ్లే వాళ్లం. కాని ఆరోగ్య మహిళ మొదలైనప్పటి నుంచి ఇక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించడం బాగుంది.

– అనిత, డోంగ్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌1
1/2

ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌

ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌2
2/2

ఆరోగ్య మహిళతో అనారోగ్యానికి చెక్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement