భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
మాచారెడ్డి : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చుక్కాపూర్‌లో చోటు చేసుకుంది. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నూనె చంద్రం(50) మూడు నెలల కిందట ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రం కుమారుడు ప్రవీణ్(25) భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురై బుధవారం తన తల్లి రాజమణి ఇంట్లో లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు నెలల వ్యవధిలో తండ్రి, కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. భర్త, కొడుకు దూరం కావడంతో ప్రవీణ్ తల్లి రాజమణి అనాథగా మారింది. ఇద్దరినీ కోల్పోయి తాను ఉండేమి ఫలితమని తలబాదుకుంటూ కన్నీరుమున్నీరైంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
రైలు కిందపడి మహిళ ..
ఖలీల్‌వాడి: ఆవేశంలో రైలు కిందపడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం తెలిపారు. స్థానికులు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి.. బోధన్ ఆచన్‌పల్లికి చెందిన ఆ సది సుజాత(38)కు 14 సంవత్సరాల క్రితం అ ర్సపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆసది రవితో వివాహమైంది.వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఎప్పుడూ ఆవేశంగా ఉండే సుజాత తరచూ భర్తతో, పక్క ఇంటి వారితో గొడవపడేది. మంగళవారం రోజున సై తం గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆవేశంతో రా త్రి 9.30గంటలకు సుజాత ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.సుజాత బుధవారం ఉదయం రైలు పట్టాల ప క్కన శవమై కనిపించింది. తన భార్య మృతిపై ఎ లాంటి అనుమానాలు లేవని భర్త రవి పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువకుడిపై స్నేక్‌గ్యాంగ్ దాడి
ఖలీల్‌వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబీబ్‌నగర్ లో ఓ యువకుడిపై స్నేక్ గ్యాంగ్ దాడి చేసినట్లు తెలిసింది. గ్యాంగ్‌లోని సభ్యుడి అనుమతి లేకుండా కాలనీలోకి రావొద్దని, పాతకక్షలతో యువకుడిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఈ దాడిలో గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఒకటోటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్‌హెచ్‌వో రఘుపతిని వివరణ కోరగా.. దాడి ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
మూడు నెలల్లో తండ్రి, కుమారుల
బలవన్మరణం
అనాథగా మారిన తల్లి..
చుక్కాపూర్‌లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment