ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌ బాధ్యతల స్వీకరణ

Published Thu, Oct 31 2024 2:22 AM | Last Updated on Thu, Oct 31 2024 2:21 AM

ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌ బాధ్యతల స్వీకరణ

ఈఆర్సీ చైర్మన్‌గా జస్టిస్‌ నాగార్జున్‌ బాధ్యతల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ని యంత్రణ మండలి (ఈఆ ర్సీ) చైర్మన్‌గా జస్టిస్‌ దేవ రాజు నాగార్జున్‌ బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ నియంత్రణ్‌ భవన్‌లోని ఈ ఆర్సీ కార్యాలయంలో ఆయనతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రమాణస్వీ కారం చేయించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ మాట్లాడుతూ వినియోగ దారులు, విద్యుత్‌ సంస్థల ప్రయోజనాలను కాపాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు ఈఆర్సీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం త్వరలో ప్రకటన జారీ చేయనుంది.

చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకు బెదిరింపు కాల్‌

రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

కొత్తపల్లి (కరీంనగర్‌): కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి, బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ ద్వారా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ చేశామని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఎమ్మెల్యే సత్యంకు ఈ నెల 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో గుర్తు తెలియని నంబరు +447886696497 నుంచి వాట్సాప్‌ కాల్‌ వచ్చిందని వెల్లడించారు. ఫోన్‌లో సదరు వ్యక్తి మాట్లాడుతూ తనకు రూ.20 లక్షలు చెల్లించాలని, లేదంటే రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన ఇద్దరు పిల్లలు అనాథలయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో సత్యం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈమేరకు 339/ 2024, భారతీయ న్యాయ సంహిత 308, 351 (3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌లోని భవా నీనగర్‌కి చెందిన యాస అఖిలేశ్‌రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడని, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడ్డట్లు తేలిందని వివరించారు. సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ ద్వారా లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీచేశామని ఏసీపీ వెల్లడించారు.

క్లుప్తంగా...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement