బిచ్కుంద(జుక్కల్): జిల్లాలో ఎక్కడా లేని విధంగా బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్‌గల్, పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, ఎల్లారెడ్డి సహా ఆయా మండలాల్లో దీపావళి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున జూదం ఆడుతారు. పేకాట లో కీటీ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు. ర మ్మీ, త్రీకార్డు, పరేల్, కట్‌పత్తా(అందర్ బాహెర్) ఇలా పేర్లతో కూలి పనిచేసే వ్యక్తుల నుంచి బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు సైతం ఒక టేబుల్‌లో కనీసం రూ.100 నుంచి రూ.లక్ష బెట్టింగ్ కడతారు. జుక్కల్ సెగ్మెంట్‌లో పోలీసులు అంతగా పట్టించుకోరని ధీమాతో నిజామాబాద్, మెదక్, కంగ్టి, బీదర్, ఔరాద్, దెగ్లూర్, నర్సీ ప్రాంతాల నుంచి పేకాట ఆడడానికి ఇక్కడికి వస్తారు.
జూదం స్థావరాలు...
బిచ్కుంద, జుక్కల్, కేంరాజ్ కల్లాలి, పిట్లం, మద్నూర్, ఎక్లార, పెద్దకొడప్‌గల్, వడ్లం, కాస్లాబాద్, తుబ్‌దాల్, దేవిసింగ్ తండా తదితర గ్రామాల్లో జూదం అడ్డాలు గతంలో కొనసాగా యి. జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామాల జూదరులకు అడ్డా. నిర్వాహకులు ఫోన్లు చేసి పోలీసులు దాడులు చేయరని ధీమా ఇస్తున్నట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు జుక్కల్, బాన్సు వాడ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టిసారించి దీపావళి పండగకు ప్రత్యేక బృందాలను పంపించి గట్టి నిఘాపెట్టి పేకాట, జూదం ఆడకుండా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
టాస్క్‌పోర్సు దాడులతో అలర్ట్...
గతడాది పొలీసు ఉన్నతాధికారులు టాస్క్‌ఫోర్సు బృందాలు ఏర్పాటు చేసి జుక్కల్ ని యోజకవర్గంపై ప్రత్యేక నిఘా పెట్టి పేకాట స్థావరాలపై దాడులు చేసి జూదాన్ని పూర్తిగా అరికట్టారు.
నోట్ల బదులు కాయిన్లు, టోకెన్లు..
అడ్డాలలో నోట్ల్లు చెలామణి చేయకుండా నిర్వాహకులు కాయిన్లు, టోకెన్లు పెట్టి ఆడించే ఏర్పా ట్లు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దాడు లు చేసినా డబ్బులు దొరక్కుండా కాయిన్లు తెరపైకి తీసుకొస్తున్నారు. పేకాటలో నకిలీ నోట్లు చెలామ ణి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహారాష్ట్ర, క ర్ణాటక నుంచి ఆడడానికి వచ్చే వారు నకిలీ నోట్లు తీసుకురావచ్చని కొందరు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment