లక్ష్యసాధనలో విద్యార్థులు ముందుకెళ్లాలి
డిచ్‌పల్లి: విద్యార్థినులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని అప్పుడే మంచి ఫలితాలు సాధించొచ్చని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను న్యాయమూర్తి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమని, అందుకోసం శిక్షణ తీసుకుని తమను తాము కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఆడపిల్లలకు ఏదైనా సమస్య ఉంటే 1098కు ఫోన్ చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండని వారు వాహనాలు నడిపిస్తే ప్రకారం శిక్షార్హులన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, మండల ప్రత్యేకాధికారి యోహాన్, ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ ప్రభాకర్, ఎస్సై మహ్మద్ షరీఫ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నళిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తి సునీత కుంచాలపై ఇటీవల ‘సాక్షి‘లో ప్రచురితమైన కథనాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నళిని ఫొటోఫ్రేమ్‌గా చేయించి అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment