బోధన్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు బోధన్ నుంచి నవంబర్ 4వ తేదీ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డీఎం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు బస్సు బోధన్ నుంచి బయల్దేరుతుందని, వర్ని, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జేబీఎస్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రాత్రి 12 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి బోధన్‌కు ఉదయం 11.10 గంటలకు చేరుకుంటుందని వివరించారు. బోధన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఒక్కొక్కరికి రూ.590 చార్జీ ఉంటుందని తెలిపారు.
పామూరుకు అదనంగా మరో బస్సు..
బోధన్ నుంచి పామూరుకు అదనంగా మరో బస్సును ప్రారంభించనున్నట్లు డీఎం తెలిపారు. ఈ సర్వీసు ప్రతి రోజూ బోధన్ బస్టాండ్ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం6.15 గంటలకు పామూరుకు చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదేరోజు సాయంత్రం 7 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి ఉదయం 8.45 గంటలకు బోధన్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment