స్వచ్ఛతకు మారుపేరు విజయ డెయిరీ
నిజామాబాద్ రూరల్: విజయ డెయిరీ పాలు స్వ చ్ఛతకు మారుపేరని, ఏ మాత్రం కల్తీకి ఆస్కారం ఉండదని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుతో కలిసి సారంగాపూర్ లోని విజయ డెయిరీని చైర్మన్ అమిత్‌రెడ్డి బుధవారం సందర్శించారు. అధికారులతో మాట్లా డి పాల సేకరణ, విక్రయాల వివరాలు తెలుసుకున్నారు. పాల శీతలీకరణ ప్రక్రియను పరిశీలించి, పాడి రైతులతో భేటీ అయి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి రైతులకు మేలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమకు తోడ్పాటునందిస్తోందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ.50కోట్ల నిధులు విడుదల చేశారని, అదనంగా మరో రూ.10కోట్ల బకాయిలను పాడి రైతులకు చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే విజయ పాల విక్రయాలు గణనీయంగా పెరిగాయని, మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ విజ య డెయిరీ యూనిట్ల ద్వారా 4.40 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా, 3.20 లక్షల లీటర్ల పాలు మాత్రమే అమ్ముడవుతున్నాయని తెలిపారు. మిగిలిన పాలను మిల్క్ పౌడర్‌గా, వెన్నగా మార్చేందుకు చిత్తూరు జిల్లాకు పంపించాల్సి వస్తుండడంతో సంస్థపై ఆర్ధిక భారం పడుతోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పాడి రైతులకు అత్యధిక ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పాడి పరిశ్రమలో నష్టాలను నివారిస్తూ, లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో రైతు సంఘాలు కూడా ఆలోచనలు చేయాలని సూచించారు.
పూర్తి సహకారం అందిస్తా
విజయ డెయిరీ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం త రఫున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. పాలు వినియోగించే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విజయ డెయిరీ పాలనే వినియోగించాలని సూచించారు.
పాడిరైతులకు తోడ్పాటునందించాలి
జిల్లాలో వినియోగం అవుతున్న పాలలో కేవ లం పది శాతం మాత్రమే విజయ డెయిరీ పాల ను వినియోగిస్తున్నారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ముల్కనూరులో రైతులు సమాఖ్యగా ఏర్పడి సమష్టి కృషితో సత్ఫలితాలు సాధించారని, అదే స్పూర్తితో జిల్లాలోని పాడి రైతులు కూడా కృషి చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, సారంగాపూర్ విజయ డెయిరీ యూనిట్ ఉప సంచాలకులు నాగేశ్వర్‌రావు, పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు జగన్నాథచారి, పాడి రైతుల సంఘం ప్రతినిధులు సురేశ్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలలో ఏమాత్రం కల్తీకి
ఆస్కారం లేదు
రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు
మేలు చేస్తోంది
పాడిపరిశ్రమాభివృద్ధి సహకార
సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment