రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
కమ్మర్‌పల్లి: స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందా డు. మండల కేంద్రంలోని మెట్‌పల్లి రోడ్డులో ఉన్న భారత్‌పెట్రో ల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కమ్మర్‌పల్లికి చెందిన చింత కిషన్(28) బిర్లా కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితుడు హరీశ్‌గౌడ్‌తో స్కూటీపై మెట్‌పల్లికి వెళ్లాడు. రాత్రి సమయంలో తిరిగి వస్తూ పెట్రోల్ పోయించేందుకు కమ్మర్‌పల్లి శివారులోని భారత్ పెట్రోల్ బంక్‌లోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పండగకు అత్తారింటికి వెళ్తూ..
బాన్సువాడ రూరల్: మండలంలో బోర్లం గ్రామాని కి చెందిన జోగొల్ల ప్రవీణ్(25) బుధవారం బీర్కూ ర్ మండలం దామరంచ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీపావళి పండుగకు హస్గుల్‌లోని తన అత్తగారి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా దామరంచ శివారులో ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు..
మాచారెడ్డి: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం భవానీపేట వద్ద కామారెడ్డి – సిరిసిల్ల రోడ్డుపై చోటు చేసుకొంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
దోమకొండ మండలం అంబారీపేటకు చెందిన టీ సుబ్బారావు(36) ద్విచక్రవాహనంపై కామారెడ్డి నుంచి అంబారిపేటకు వెళ్తుండగా, మాచారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ప్యాసింజర్ ఆటో భవానీపేట వద్ద ఢీకొట్టింది. ఈఘటనలో సుబ్బారావు అక్కడి కక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment