సెల్ ఫోన్ అప్పగింత
మాచారెడ్డి: పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి గ్రామానికి చెందిన అంబాల రమేశ్ ఇటీవల తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. సీఈఐఆర్ ద్వారా రికవరీ చేసిన సెల్‌ఫోన్‌ను ఎస్సై అనిల్ శనివారం బాధితుడికి అందజేశారు.
వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
మాచారెడ్డి: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర విద్యా మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆ సంఘం నాయకులు శనివారం ఘన్‌పూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు. డిసెంబర్ 1, 2 తేదీల్లో కామారెడ్డిలో నిర్వహించే విద్య మహాసభలకు విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు గోపాలకృష్ణ, రాజు, కామారెడ్డి మండల అధ్యక్షుడు పడిగె రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఏసురత్నం, హెచ్‌ఎం శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీఐటీయూలో చేరిక
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గ్రామంలోని శివాజీ బీడీ కంపెనీలో పనిచేస్తున్న చాటన్ బట్టీ కార్మికులు శనివారం సీఐటీయూలో చేరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ కార్మికులకు స్వాగతం పలికారు. నాయకులు కొత్త నర్సింలు, రాజు శ్రీనివాస్, నందగిరి రాజు, భాగ్య, గుర్రాల రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు దయానంద సరస్వతి బలిదాన దినోత్సవం
కామారెడ్డి అర్బన్: ఆర్యసమాజం వ్యవస్థాపకులు మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం వరకు యజ్ఞ సహిత శోభయాత్ర, భజనలు, ప్రవచనల కార్యక్రమాలు నిర్వహించనున్న ట్టు ఆర్యసమాజ్ ప్రతినిధి అర్వపల్లి రమేశ్ తెలిపా రు. ఆర్యనగర్‌లో నిర్వహించే కార్యక్రమానికి ఆర్య బంధువులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
ఓటరు నమోదు పరిశీలన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డితోపాటు పలు గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసీల్దార్ గంగాసాగర్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట ఆర్‌ఐ సాహిత్య, జూనియర్ అసిస్టెంట్ రాజు, బీఎల్‌వో లింగం తదితరులు పాల్గొన్నారు.
సర్వీస్ బుక్‌లు అందజేత
సదాశివనగర్(ఎల్లారెడ్డి): నూతనంగా విధుల్లో చేరిన ఉపాధ్యాయులకు మండల కేంద్రంలోని ఎమార్సీ భవనం వద్ద పీఆర్‌టీయూ టీఎస్ ఆధ్వర్యంలో సర్వీస్ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యోసెఫ్, పీఆర్‌టీయూ రాష్ట్ర సహ అధ్యక్షుడు జూకంటి బాపురెడ్డి, కాంప్లెక్స్ హెచ్‌ఎం విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు గాదారి రాజిరెడ్డి, జిల్లా, మండల బాధ్యులు బసంత్‌రాజ్, సాయిరెడ్డి, బిల్యా, రాజు, హన్మంత్‌రెడ్డి, సహేందర్, నరేందర్, వెంకట్, వీరమహేందర్, సంతోష్, బాల్‌కిషన్ తదితరులు పాల్గొన్నారు.
పశువులకు చికిత్స
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని ఇల్చిపూర్‌లో శనివారం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి 77 పశువులకు చికిత్స చేశారు. ఐదు గేదెలకు కృత్రిమ గర్భధారణ, 21 దూడలకు నట్టల నివారణ మందు వేశారు. పశువైద్యులు రవికిరణ్, రమేశ్, సూపర్‌వైజర్ కృష్ణ, గోపాలమిత్రలు బాలయ్య, శ్రీనివాస్, బాబాగౌడ్, సిబ్బంది మోహిన్, ప్రవీణ్, పాడిరైతులు పాల్గొన్నారు.
ప్రజాపాలనపై కళా ప్రదర్శన
భిక్కనూరు: మండల కేంద్రంలో ప్రజాపాలనపై కళాబృందం శనివారం ప్రదర్శన నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహలక్ష్మి, గృహజ్యోతి పథకాల లబ్ధిని ఒగ్గు కథ రూపంలో ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కళాకారులు మహేందర్, విఠల్‌రెడ్డి, నాగరాజు, ప్రశాంత్, కాశీరాం, పోశెట్టి, సవిత, లత పాల్గొన్నారు.
బజరంగ్ దళ్ కమిటీ ఎన్నిక
నస్రుల్లాబాద్(బాన్సువాడ) : విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నస్రుల్లాబాద్ ప్రఖండ సంఘటన్ ఎన్నికను శనివారం విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ నిర్వహించారు. బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా అరిగె నారాయణ, కార్యదర్శిగా మన్నె శివకుమార్, ఉపాధ్యక్షుడిగా ఆరెళ్ల సునీల్, సభ్యులుగా అంజయ్య, శివసాగర్, రాఘవ తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో చందూరి హన్మాండ్లు, కనుకుట్ల శ్రీనివాస్, చరణ్, సాయిలు, మహేందర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మోటారు బిగింపు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బీసీ కాలనీలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం తవ్విన బోరుకు మోటారును బిగించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య, ఏఎంసీ డైరెక్టర్ ఆస సురేశ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు చిందం రాజయ్య, వార్డు మాజీ సభ్యుడు జగ్గ బాల్‌రాజు, మాజీ ఎంపీటీసీ బీరయ్య, రాజేందర్, రూపేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమ్మరి రాజయ్య, భైరయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment