● భయంతో ఆత్మహత్య చేసుకున్న
మరో నిందితుడు
భిక్కనూరు: భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఈనెల 20న హత్యకు గురైన మహిళ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కంచర్ల గ్రామానికి చెందిన సుగుణను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కామారెడ్డి డీఎీస్పీ నాగేశ్వర్రావు, ఆధ్వర్యంలో సీఐ సంపత్‌కుమార్, ఎస్సై సాయికుమార్ కేసు దర్యాప్తు ప్రారంభించారు. బీబీపేట మండలం యాడారం గ్రామా నికి చెందిన ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి భయంతో పురుగుల మందు తాగినట్లు సమాచారం. కాగా సదరు వ్యక్తి చికిత్స పొందుతూ కామారెడ్డి ఆస్పత్రిలో మృతి చెందినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment