తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ రైతువేదిక భవనం తలుపును దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేసినట్లు ఏవో నర్సింలు తె లిపారు. కార్యాలయంలో ఉన్న రూ.4 లక్షల విలువై న వీడియో కాన్ఫరెన్స్ సెట్ సురక్షితంగా ఉందన్నా రు.ఈ ఘటనపైపోలీసులకుఫిర్యాదుచేశామన్నారు.
ఉద్యోగం పేరిట టోకరా
కామారెడ్డి క్రైం: అమెజాన్ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని ఓ వ్యక్తికి రూ.3,850 లకు టోకరా వేశారు. పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన నజీరుద్దీన్ అనే వ్యక్తికి మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి అమెజాన్ కంపెనీ లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. అందుకు విడతలవారీగా రూ.3,850 ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. చార్జీల పేరుతో మళ్లీ, మళ్లీ డబ్బులు వేయాలని అవతలి వ్యక్తి చెప్పడంతో అనుమానం వచ్చిన నజీరుద్దీన్ బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఉచిత ఫిజియోథెరపి శిబిరం
దోమకొండ: మండల కేంద్రంలోని భవిత విద్య కేంద్రంలో బుధవారం ఫిజియోథెరపి శిబిరం నిర్వహించారు. దివ్యాంగ విద్యార్థులకు డాక్టర్ సాయి కిరణ్ వివిధ వ్యాయామ చికిత్సలు అందించారు. సలహాలు, సూచనలిచ్చారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, ఐఈఆర్‌పీ దా మోదర్,విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment