‘లస్కర్’ చుట్టూ దందా!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జీవీసీ(గోదావరి వ్యాలీ సర్కిల్)–1 పరిధిలో మొత్తం 7 లస్కర్ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అందులో ఎస్సారెస్పీ డివిజన్–1 విభాగంలో ఒక్క పోస్టు మాత్రమే కేటాయించింది. కానీ ఎస్సారెస్పీ డివిజన్–1లో వందల పోస్టుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రచారం చేస్తూ ఉద్యోగులు ఇప్పిస్తామంటూ ఎస్సారెస్పీలో దందా షురూ చేశారు. అసలు విషయం తెలియక ఉద్యోగాల ఆశతో అనేక మంది నిరుద్యోగులు ఎస్సారెస్పీ కా ర్యాలయం చుట్టూ తిరుగుతూ మధ్యవర్తుల ఉచ్చు లో పడుతున్నారు.
ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు సైతం ఇప్పటి వరకు లస్కర్‌ల నియామకంపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ దరఖాస్తు ఇస్తే మాత్రం కార్యాలయంలో స్వీకరిస్తున్నారు. అసలు ఏమి జరుగుతుందో తెలియక నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవసరం ఉంది..
ఎస్సారెస్పీ డివిజన్–1 విభాగంలో పని చేసేందుకు కనీసం 30 మంది లష్కర్‌ల కొరత ఉంది. 30 మంది లష్కర్‌లను నియమించినా సరిపోని పరిస్థితి ఉంది. కానీ ఎస్సారెస్పీలో పదవీ విరమణలే తప్ప నూతన ఉద్యోగుల రాక లేదు. దీంతో ప్రాజెక్ట్ నుంచి అనేక సబ్ డివిజన్‌లు తరలిపోయి కళను కోల్పోయింది. ప్రస్తుతం తప్పుడు ప్రచారంతో కొందరు నిరద్యోగుల నుంచి దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే లష్కర్ పోస్టుపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కార్యాలయం
అవుట్ సోర్సింగ్ ద్వారా..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డివిజన్–1లో లస్కర్‌ల కొరత తీవ్రంగా ఉంది. కానీ గత ప్రభుత్వం వీఆర్‌ఏల సర్దుబాటులో భాగంగా 13 మంది వీఆర్‌ఏలను లస్కర్లుగా నియమించింది. కానీ అందులో ఒక వీఆర్‌ఏ లస్కర్‌గా విధుల్లో చేరకపోవడంతో పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఆ పోస్టును అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది.
ఎస్సారెస్పీ డివిజన్–1 లో
ఒక్క లస్కర్ పోస్టు
ఎస్సారెస్పీ డివిజన్–1లో
ఉన్నది ఒక్క పోస్టు
భర్తీ చేసేది ఒక్క పోస్టు అయినా.. వందల పోస్టుల భర్తీ అంటూ ప్రచారం
మధ్యవర్తుల ఉచ్చులో చిక్కుకుంటున్న నిరుద్యోగులు
మోసపోవద్దు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ డివిజన్–1లో ఒక్క లష్కర్ పోస్టు మాత్రమే ప్రస్తుతం భర్తీ చేసే అవకాశం ఉంది. అనేక మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎవరికీ చిల్లి గవ్వ ఇవ్వాల్సిన పనిలేదు. సీఈ స్థాయిలో నియామకం ఉంటుంది. నిరుద్యోగులు ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.
– చక్రపాణి, ఈఈ , ఎస్సారెస్పీ
Comments
Please login to add a commentAdd a comment