ప్రధాని మోదీని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెలే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రధానిని కలిసి రాష్ట్ర అభివృద్ధి, సమస్యలపై చర్చించారు.
ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్‌ను
కలిసిన జుక్కల్ కాంగ్రెస్ నేతలు
నిజాంసాగర్(జుక్కల్): ఢిల్లీలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేష్ లిలోతియాను బుధవారం జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్ కలిశారు. జుక్కల్ నియోజకవర్గంలో నామినేటేడ్ పోస్టుల వ్యవహారంలో అభ్యర్థుల ఎంపికపై తమకు జరుగుతున్న అన్యాయాలపై లితోతియాకు వివరించినట్లు అరవింద్ తెలిపారు.
సత్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: క్రిస్మస్ పండుగ సందర్భంగా సామాజిక, విద్య, వైద్యం, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో ఉత్తమ సేవ అందించిన, ప్రతిభ కనబర్చిన 30 ఏళ్లు పైబడిన క్రైస్తవ వ్యక్తులు, సంస్థలను ఎంపిక చేసి ప్రభుత్వపరంగా సత్కరించనున్నట్టు అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు కలెక్టరేట్‌లోని మైనారిటీ సంక్షేమ కార్యాలయం 222 నంబర్ గదిలో తమ నామినేషన్లను డిసెంబర్ 5లోగా అందజేయాలని సూచించారు. లేదా తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ ఫైనాన్స్ కార్పొరేషన్ సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.
చెట్లతో కలిగే
ఉపయోగాలపై అవగాహన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన వారోత్సవాలలో భాగంగా గోపాల్‌పేట హైస్కూల్ విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వనదేవతల వేషధారణతో గోపాల్‌పేటలో ర్యాలీ తీశారు. చెట్లను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు ఆక్సిజన్ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. దీంతోపాటు పచ్చదనం–పరిశుభ్రత, మొక్కల పెంపకం అనే అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. సీజీఆర్ మెంటర్ టీచర్ సభాత్ కృష్ణ, ఉపాధ్యాయులు రాము, నరేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment