ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలుశిక్ష

Published Thu, Nov 28 2024 1:39 AM | Last Updated on Thu, Nov 28 2024 1:39 AM

-

రుద్రూర్‌: ద్విచక్ర వాహనాన్ని అతివేగం, అజాగ్రత్తగా నడిపి ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి న్యాయంస్థానం బోధన్‌ కోర్టు అడిషనల్‌ జడ్జి శివసాయి ఏడాదిన్నర జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. 2016 జూలై 19 తేదీన త్రిశూల్‌ శంకర్‌ అనే వ్యక్తి బైక్‌పై వస్తుండగా సులేమాన్‌ నగర్‌ గ్రామానికి చెందిన షేక్‌ లతీఫ్‌ టీవీఎస్‌ ఎక్సెల్‌పై అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో శంకర్‌ మృతి చెందాడని తెలిపారు. బాధితుల తరఫున పబ్లిక్‌ ప్యాసిక్యూటర్‌ సీహెచ్‌ రాణి వాదనలు వినిపించినట్లు ఎస్సై తెలిపారు.

పోక్సో కేసు నమోదు

ఖలీల్‌వాడి: నగరంలోని నాల్గో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలికను ఈవ్‌ టీజింగ్‌ చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ బుధవారం తెలిపారు. బాలికను సదరు యువకులు వేధించినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement