జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగంగా విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. సౌత్ క్యాంపస్‌ను కామారెడ్డి జిల్లా యూనివర్సిటీగా మార్చాలని, అలాగే జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, మెడికల్ నర్సింగ్, లా కాలేజ్, కేంద్రీయ విద్యాలయం, టీటీసీ, బీఈడీ, ఎంఈడీ, మహిళా డిగ్రీ కళాశాల, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్‌లో రైతుల నుంచి వసూలు చేస్తున్న తైబజార్ ఎత్తివేయాలని, గంజ్‌లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని, పట్టణంలో మరొక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ క్యాతం సిద్ధిరాములు, ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్, మాజీ జెడ్పీటీసీ మల్లన్న, నాయకులు సాప శివరాం, గంగారాం, ఎల్‌ఎన్. ఆజాద్, ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు ఐరేని సందీప్, అరుణ్, సతీష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment