దోమకొండ: మండలంలోని నిరుద్యోగ యువతీయువకులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అక్షయ ఇన్సిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. మహిళళలు, గృహిణులు, విద్యార్థులకు(18–29 వయసు) ఉచితంగా టైలరింగ్, మగ్గం వర్క్, బ్యుటీషియన్, చీరలపై పూతలు, డాటా ఎంట్రీ ఆపరేటింగ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ తదితర విషయాలపై శిక్షణ ఉంటుందని వివరించారు. కోర్సులో చేరేందుకు ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు ఇవ్వాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment