జోరుగా చెరుకు క్రషింగ్
నిజాంసాగర్: మాగిలోని గాయత్రి కర్మాగారంలో చెరుకు క్రషింగ్ జోరుగా సాగుతోంది. రోజుకు 3,700 మెట్రిక్ టన్నుల చొప్పున గా నుగాడిస్తున్నారు. కర్మాగారం పరిధిలో రైతు లు 8 వేల ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. పంట కోతకోసం 25 హార్వెస్టింగ్ యంత్రా లు, రవాణాకు 170 లారీలను వినియోగిస్తున్నారు. 70 ముఠాలు చెరుకు కోతలో భాగమవుతున్నాయి. ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నుల క్రషింగ్ లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.34 లక్షల మెట్రిక్ టన్నులు క్రషింగ్ చేశా రు. నవంబర్ 4న క్రషింగ్ ప్రారంభించామ ని గాయత్రి కర్మాగారం కేన్ మేనేజర్ వెంగళ్‌రెడ్డి తెలిపారు.
అడ్లూర్ ఎల్లారెడ్డిలో..
సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయ త్రి షుగర్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ జోరు గా సాగుతోంది. ఇప్పటివరకు 2.17 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు పంటను క్రషింగ్ చే సినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావుతెలిపారు. పర్మిట్లఆధారంగా చెరుకును గానుగకు తరలిస్తున్నామని పేర్కొన్నారు.
నేడు సంక్రాంతి ఉత్సవం
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని సరస్వ తి విద్యామందిర్ హైస్కూల్ వద్ద ఆదివారం ఉదయం 7.30 గంటలకు సంక్రాంతి ఉత్స వం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్ కామారెడ్డి నగర కార్యవాహ శివరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవానికి వక్తగా ఆర్‌ఎస్‌ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర (తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక రాష్ట్రాలు) సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ హాజరవుతారని పేర్కొన్నారు. స్వయం సేవకులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
‘పండుగకు ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి’
కామారెడ్డి టౌన్: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేవారు దొంగతనా ల నివారణ కోసం పలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సింధుశర్మ ఒక ప్రకటనలో సూ చించారు. ఊరికి వెళ్లే సమయంలో ఇంటిలో విలువైన వస్తువులు, నగలు, బంగారం, నగదు ఉంచవద్దని పేర్కొన్నారు. వాహనాల ను ఇంటి ఆవరణలో పార్క్ చేసి, తాళాలను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఇళ్ల వద్ద, కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుని డీవీఆర్‌ను రహస్య ప్రదేశాల్లో భద్రపరిచి మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎవరిౖపైనెనా అనుమానం వస్తే డయల్ 100 లేదా కామారెడ్డి పోలీస్ కంట్రోల్ రూమ్ (87126 86133)కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
రిపబ్లిక్ డేకు డ్వాక్రా మహిళకు ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, కా మారెడ్డి : దేశ రాజ ధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు ప్ర త్యేక అతిథులుగా వివిధ వర్గాలకు చెందిన వారిని ఆహ్వానించారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కమ్మరి రాధను అతిథిగా ఎంపిక చేశారు. ఈనెల 26న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
వడ్డె ఓబన్న జయంతి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర వడ్డెర వృత్తిదారుల సంఘం, బీసీ కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శనివారం వడ్డె ఓబన్న జయంతి నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిలు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్సింలు, రాజు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ వెంకట్ గౌడ్, నాయకులు రాజనర్సు, నర్సింలు, శ్రీనివాస్, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు రక్తదాతలు,
మోటివేటర్లకు అవార్డులు
కామారెడ్డి అర్బన్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం పట్టణంలోని కళాభారతిలో రక్తదాతలు, మోటివేటర్లకు అవార్డులు అందజేయనున్నారు. ఈ విషయాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా సమన్వ యకర్త బాలు ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment