నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసింది. మంగళ, బుధవారాలలో సంక్రాంతి భోగి, కనుమ పండుగ సంబరాలు జరుగనుండడంతో ఈ వారం క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కనుమ రోజున ప్రత్యేకంగా మాంసాహార విందు భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో శనివారంనాటి మేకల సంతలో సందడి నెలకొంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వ్యాపారులు మేకలతో శుక్రవారం రాత్రే సంతకు చేరుకున్నారు. అయితే సంత ప్రాంగణం ఇరుకుగా ఉండడం, బాసర రహదారికి ఇరువైపులా క్రయవిక్రయాలు జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సంతలో రూ. 4 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment