ఉన్నతోద్యోగం చేస్తూ పీహెచ్‌డీ పట్టా..
గాంధారి మండలం లొంకతండాకు చెందిన సురేందర్ అటవీశాఖ వాతావరణ విభాగంలో సీనియర్ సైంటిస్ట్‌గా నాగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. గాంధారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న సురేందర్.. కామారెడ్డిలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. చైన్నెలో ఫారెస్ట్రీలో పీజీ చేసి, అటవీ శాఖలో ఉద్యోగం సాధించారు. జీవ వైవిధ్యం, సంరక్షణ, వాతావరణంలో మార్పులు సరైన సూచనలు అనే అంశంపై ఇటీవల పరిశోధన చేసి, జేఎన్‌టీయూ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. మారుమూల ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సురేందర్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment