కామారెడ్డి అర్బన్: రాష్ట్ర కార్మిక సంక్షేమ మండ లి ఇచ్చే స్కాలర్‌షిప్‌లకోసం కార్మికుల పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ ఎం.కోటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకట నలో సూచించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, బీసీఏ, ఎంబీఏ, బీఫార్మాసీ తదితర కోర్సులు పాసైన వారు వచ్చేనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు కామారెడ్డి కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment