మంటలతో నష్టం జరగలేదు
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో సోమ వారం రాత్రి చెలరేగిన మంటల వల్ల ఉద్యాన క్షేత్రానికి ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఆమె మంగళవారం ఉ ద్యాన క్షేత్రాన్ని పరిశీలించారు. స్థానిక ఉద్యాన శాఖ అధికారి కమలాకర్‌రెడ్డితో మాట్లాడి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె వి లేకరులతో మాట్లాడారు. క్షేత్రం బయట గుర్తుతెలి యని వ్యక్తులు పెట్టిన మంటలు గాలికి క్షేత్రంలోకి వ్యాపించి ఉంటాయని భావిస్తున్నామన్నారు. పండ్ల చెట్ల మధ్య విపరీతంగా పెరిగిన గడ్డితో మంటల తీ వ్రత పెరిగిందన్నారు. కొంతకాలంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఉద్యాన క్షేత్రంలో పనులు చేపట్టలేక పోతున్నామన్నారు. మంటల కారణంగా మామిడి తోటలోని 35 చెట్లు పాక్షికంగా కాలిపోయాయని, వాటికి నీటిని అందించి బతికిస్తామన్నారు. మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రం పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.
2వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యం..
జిల్లాలో ఈ ఏడాది 2 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం పంటను సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామ ని జ్యోతి తెలిపారు. ఇప్పటివరకు 657 ఎకరాలకు మంజూరు లభించిందని, అందులో 344 ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తయ్యిందని వివరించారు. ఆయిల్‌పాం, చెరుకు, కూరగాయలు సాగుచేసే రై తులకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందజేస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది 3,500 ఎకరాల్లో చె రుకు తోటలకు డ్రిప్ పరికరాలను అందించాల్సి ఉండగా ఇప్పటివరకు 1,100 ఎకరాలకు డ్రిప్ ఏ ర్పాటు చేశామని పేర్కొన్నారు. 500 ఎకరాల్లో కూ రగాయల సాగుకు డ్రిప్ పరికరాలను అందించామన్నారు. కార్యక్రమంలో మాల్తుమ్మెద, కామారెడ్డి, స దాశివనగర్ ఉద్యాన శాఖ అధికారులు కమలాకర్‌రెడ్డి, రామకృష్ణ, హర్షవర్ధన్ పాల్గొన్నారు.
ఉద్యాన క్షేత్రం పరిస్థితిని
ఉన్నతాధికారులకు వివరిస్తాం
జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి
Comments
Please login to add a commentAdd a comment