‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
కామారెడ్డి టౌన్: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.నాగరాణి సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మహిళలపై దాడులను అరికట్టడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోజూ పౌష్టికాహారం అందించాలని హెచ్‌ఎంకు సూచించారు. గుడ్, బ్యాడ్ టచ్‌ల గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్రవంతి వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో ఎల్లయ్య, హెచ్‌ఎం సావిత్రి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది శ్రవణ్, సాయిప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగ ఉపకరణాల పంపిణీకి అర్హుల ఎంపిక
కామారెడ్డి క్రైం: దివ్యాంగులకు అలీంకో సంస్థ ద్వారా అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. అలీంకో, జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కేవీఎస్ గార్డెన్‌లో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కోసం ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 572 మంది దివ్యాంగులు ఈ శిబిరంలో పాల్గొన్నారని కలెక్టర్ తెలిపారు. వీరికి అర్హతలను బట్టి అవసరమైన పరికరాలను అలీంకో సంస్థ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. అనంతరం బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్లు గడుస్తున్న సందర్భంగా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, దోమకొండ, కామారెడ్డి సీడీపీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
కొనసాగుతున్న
నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 4వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 700 క్యూసెక్కులు, అలీసాగర్ లిప్టు ద్వారా 450 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment