ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

Published Tue, May 7 2024 4:55 AM

ఉమ్మడ

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: మాడు పగిలే ఎండలతో తల్లడిల్లుతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. మంగళవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

కేడీసీసీబీ ప్రగతిపై నజర్‌

కరీంనగర్‌ అర్బన్‌: కేడీసీసీబీ నిధుల వినియోగంపై అధ్యయనం చేసేందుకు నాబార్డు కమిటీ సోమవారం కరీంనగర్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు ఎండీ ఎన్‌.మురళీధర్‌, నాబార్డు రిటైర్డ్‌ సీజీఎం సందర్శించి కేడీసీసీబీ సేవలను కొనియాడారు. దేశంలో సహకార సంఘాల బలోపేతానికి మరిన్ని నూతన పథకాలను ప్రవేశపెట్టేందుకు నాబార్డుకు నివేదిక అందిస్తామని వివరించారు. పీడీసీ రిసోర్స్‌ పర్సన్‌ సత్యనారాయణ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డీసీసీబీ ప్రగతిని వివరించారు. కేడీసీసీబీ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, సీఈవో సత్యనారాయణరావు, నాబార్డు డీడీఎం జయప్రకాశ్‌, మనోహర్‌రెడ్డి, దిలీప్‌, జీఎంలు ప్రభాకర్‌రెడ్డి, ఉషశ్రీ ఉన్నారు.

మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలి

తిమ్మాపూర్‌: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీని సోమవారం జిల్లా పంచాయతీ అధి కారి రవీందర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, నిర్వహణ తీరును అభినందించారు. అనంతరం తాగునీటి సరఫరాపై సమీక్షించారు. గ్రామ పంచాయతీలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, కంపోస్ట్‌ స్టాల్‌, శానిటేషన్‌, ప్లాంటేషన్‌, నర్సరీ, కంపోస్ట్‌ షెడ్‌, వైకుంఠధామాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను నిషేధించాలని, తడి పొడి చెత్తను ఇంటింటా సేకరించి సెగ్రిగేషన్‌ షెడ్డుకు తరలించాలని ఆదేశించారు. ఎంపీడీవో విజయకుమార్‌, ఎంపీవో కిరణ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి కె.మహేందర్‌రావు పాల్గొన్నారు.

‘ప్రభుత్వ వైద్యులపై దాడి అమానుషం’

కరీంనగర్‌టౌన్‌: కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బందిపై జరిగిన దాడి అమానుష చర్య అని ఐఎంఏ కరీంనగర్‌శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ పొలాస రాంకిరణ్‌, డాక్టర్‌ వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ధ్వంసం చేసిన ప్రభుత్వ ఆస్తులను రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దుశ్చర్యను తానా అధ్యక్షడు డాక్టర్‌ ఎన్‌.మహే శ్‌, కార్యదర్శి డాక్టర్‌ శ్రీధర్‌, సీనియర్‌ డాక్టర్లు బీఎన్‌.రావు, జగన్మోహన్‌రావు, కిషన్‌, అలీం, రాజ్‌కుమార్‌ తీవ్రంగా ఖండించారు. కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై రోగి బంధువుల దాడి చేసి, డీజిల్‌ పోసి హత్యాప్రయత్నం చేయడం హేయకరమైన చర్య అని కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

దివ్యాంగులు, వృద్ధుల జాబితాను అందజేయాలి

నగరపాలకసంస్థ కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని పోలింగ్‌కేంద్రాల వారిగా వయోవృద్ధులు, దివ్యాంగుల జాబితాలు అందజేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ ఆదేశించారు. సోమవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో మెప్మా అధికారులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న జరిగే పోలింగ్‌కు వయోవృద్ధులు, ది వ్యాంగులను కేంద్రాలకు తరలించేందుకు రవా ణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సమాఖ్యల పరిధిలో ఉన్న ఆర్‌పీలు దివ్యాంగులు, 60 సంవత్సరాలు పైబడిని వయోవృద్ధులను గుర్తించి జాబితాను సంబంధిత సీవోలకు అందజేయాలన్నారు. ఆ జాబి తా ఆధారంగా పోలింగ్‌ కేంద్రాలకు ఆటోల ద్వారా వికలాంగులు, వయోవృద్ధులను తీసుకురావడం, తిరిగి ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. టీఎంసీ అనిత ఉన్నారు.

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
1/2

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
2/2

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

Advertisement
 
Advertisement