మహిళా చట్టాలను తెలుసుకోవాలి
కరీంనగర్: మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా మహిళా చట్టాలను ప్రజలు తెలుసుకోవాలని సీడీపీవో సబిత అన్నారు. పక్షోత్సవాల సందర్భంగా చింతకుంటలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌లో గురువా రం ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల ముక్తుభారత్ అంశంపై ప్రతిజ్ఞ చే శారు. సఖీ నిర్వాహకురాలు లక్ష్మీ, ఆదరణ సే వా సమితి అధ్యక్షురాలు కర్రె పావని రవి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత, చైల్డ్ హెల్ప్ లైన్ ని ర్వాహకులు సంపత్, మహిళా సాధికారత ని ర్వాహకులు శ్రీలత, రోహిణి, న్యాక్ అకాడమీ నిర్వాహకులు సువర్ణ, పాల్గొన్నారు.
పరీక్ష తేదీలను
మార్పు చేయాలి
కరీంనగర్‌టౌన్: డిసెంబర్ 15, 16వ తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూప్–2 పరీక్షలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌బీ పరీక్షలను ఒకే రోజులు నిర్వహిస్తున్నందున నిరుద్యోగుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పరీక్షల తేదీలను మార్పు చేయాలని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోర్స్ వ్యవస్థాపకుడు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ బండారి రాజ్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు.
డిగ్రీ కళాశాలలో
వైద్యశిబిరం
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం నగునూరు సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా గురువారం చామనపల్లి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు మనోహర్, శ్రీకాంత్‌లు విద్యార్ధినులకు వైద్యపరీక్షలు నిర్వహంచి మందులు పంపిణీ చేశారు. అనంతరం కళాశాలలోని వంటగది, డైనింగ్‌హాల్, పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ సమత, సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, వైద్యాధికారి చైతన్య, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment