మహిళా సమాజాన్ని మేల్కొల్పిన మహాత్ముడు పూలే
కరీంనగర్ కార్పొరేషన్:విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి మహిళలను, వెనకబడిన వర్గాలను మేల్కొల్పిన మహాత్ముడు జ్యోతిబాపూలే అని సుడా చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం డీసీసీ కార్యాలయం, శాతవాహన యూనివర్సిటీ చౌరస్తాలోని పూలే విగ్రహం వద్ద కార్యక్రమాలు నిర్వహించారు. పూలే చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బహుజన పాఠశాలలను నెలకొల్పి, మహిళా అక్షరాస్యతకు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు. బీసీ సంఘాల కోరిక మేరకు పూలే కూడలిని త్వరలోనే ఆధునీకరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి ఆంజనేయిలుగౌడ్, శ్రావణ్ నాయక్, బాబు, రాజిరెడ్డి, ధన్నా సింగ్, వంగల విద్యాసాగర్, సాయిరి దేవన్న, రామిడి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
కరీంనగర్: బీసీ సంఘాల అధ్వర్యంలో యూనివర్సిటీ ఎదుట ఉన్న జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పూలే విగ్రహం చుట్టూ పార్క్, ఐమాక్స్ లైట్లు ఆధునీకరణ కొరకు నిధులు కేటాయించాలని కోరుతూ బీసీ సంఘాల అధ్వర్యంలో సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సుడా చైర్మన్ సానుకూలంగా స్పందిస్తూ నిధులు కేటాయిస్తామని హమీ ఇచ్చి నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రాజు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్ర కాశ్, జిల్లా అధ్యక్షులు కనకయ్యగౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘం నాయకులు శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణకు విశేష కృషి చేసిన సామాజిక తత్వవేత్త జ్యోతిబాపూలే అన్నారు. బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గుంటీ స్వరూప, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల ఉమ మహేశ్వర్, యువజన సంఘం జిల్లా కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, మహిళ విభాగం నగర అధ్యక్షురాలు సండ్ర సరిత తదితరులు పాల్గొన్నారు.
బీఎస్పీ ఆధ్వర్యంలో..
నగరంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యాలయంలో జ్యోబాపూలే చిత్రపటానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిషాని రామచంద్రం, రాష్ట్ర కార్యదర్శి సమ్మయ్య కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో..
కరీంనగర్‌క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తిరుకవోలు రఘువీర్ ,కార్యదర్శి బీమా సాహెబ్‌లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జ్యోతిరావు పూలే కృషి ఫలితంగానే అందరికీ విద్యా అందిందని గుర్తు చేశారు. బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బెజ్జంకి శ్రీకాంత్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment