అమ్మవారికి వెండి పట్టుచీర | - | Sakshi
Sakshi News home page

అమ్మవారికి వెండి పట్టుచీర

Published Fri, Nov 29 2024 1:26 AM | Last Updated on Fri, Nov 29 2024 1:26 AM

అమ్మవారికి వెండి పట్టుచీర

అమ్మవారికి వెండి పట్టుచీర

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరీదేవికి సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్‌ కుటుంబ సభ్యులు వెండి పట్టుచీరను గురువారం బహూకరించారు. 250 గ్రాముల వెండి పట్టుదారాన్ని ఉపయోగించి 20 రోజులపాటు శ్రమించి చేనేతమగ్గంపై నేసినట్లు హరిప్రసాద్‌ తెలిపారు. చీరలో ధార్మిక, కార్మికక్షేత్రాలను పొందుపరుస్తూ వేములవాడ కమాన్‌, కోడెమొక్కు, సిరిసిల్ల చేనేతమగ్గం తదితర చిత్రాలను చీరలో పొందుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్‌ను ఆలయ అధికారులు సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement