విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం
కరీంనగర్‌ః రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటోందని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకుందో ఈ ప్రభుత్వం కూడా ఆడుకుంటుందన్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు. ఒకే ఏడాదిలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సంఘటన జరిగి మరవకముందే ఇంకో సంఘటన జరుగుతుందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి బామండ్ల నందం, జిల్లా హాస్టల్స్ ఇన్‌చార్జి అన్నాడి శ్రీవర్ధన్, జోనల్ ఇన్‌చార్జీలు అనిల్, విష్ణు, యోగేశ్ ,నగర సంయుక్త కార్యదర్శి వంశీ, హరీశ్, హరి ఓం, ఆకాశ్, ప్రశాంత్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment