మాలల సింహగర్జన విజయవంతం చేయాలి
రాష్ట్రస్థాయి జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్‌రూరల్: హైదరాబాద్‌లో డిసెంబరు1న జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య కోరారు. గురువారం కరీంనగర్ మండలం దుర్శేడ్ గ్రామంలో మాలల సింహగర్జన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహనాడు చేపట్టే ఆందోళన కార్యక్రమాల్లో మాలలందరూ భాగస్వాములు కావాలన్నారు. సింహగర్జనకు ప్రతీ ఇంటినుంచి మాలలు స్వచ్ఛందంగా కదిలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంనేయులు, ప్రచార కార్యదర్శి తాళ్ల వెంకటేశ్, నాయకులు గంట శ్రీనివాస్, దామెర సత్యం యాదగిరి, ఎం. రమేశ్, గాజుల అంజయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
కరీంనగర్ కార్పొరేషన్: ఇటీవల తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురిని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరామర్శించారు. పెద్దపల్లి మాజీ ఎంపీ గొట్టె భూపతి భార్య శాంతి ఇటీవల మరణించగా, ఆయన నివాసానికి వెళ్లి గొట్టె భూపతిని, ఆయన కుమారుడు సుధీర్‌బాబును పరామర్శించారు. ఇటీవల మరణించిన డీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు ఇంటికి వెళ్లి హనుమంతరావు కుటుంబసభ్యులను, కుమారుడిని కోల్పోయిన కాంగ్రెస్ కార్పొరేటర్ కోటగిరి భూమాగౌడ్‌ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. మంత్రి వెంట మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర హౌస్‌ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, గడ్డం విలాస్‌రెడ్డి, గోపగాని సారయ్యగౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, మాచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గొట్టె భూపతికి కెప్టెన్ లక్ష్మీకాంతరావు పరామర్శ
మాజీ ఎంపీ గొట్టె భూపతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబులను మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు పరామర్శించారు. భూపతి భార్య శాంతి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, కట్టంగూరి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్విని యోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. గురువారం 7వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డేటా ప్రో ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు నిరంజన్, బీజేపీ నాయకులు తోట సాగర్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఈనెల 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో జరిగే జూనియర్ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు కరీంనగర్‌లోని కోరా ఉన్న పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో యోగేశ్వరి, సాయి శరణ్యలు ప్రతిభ కనబర్చారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల చైర్మన్ మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం, హరికృష్ణ, సంతోశ్‌రెడ్డిలు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment