గిడుగు స్మారక జాతీయ పురస్కారానికి ఎంపిక
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌లోని గాయత్రినగర్‌కు చెందిన ప్రముఖ కవి గంప ఉమాపతి గి డుగు రామ్మూర్తి పంతులు స్మా రక జాతీయ పురస్కారానికి ఎ ంపికయ్యారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో అవార్డు అందుకోనున్నారు. సామాజిక అంశంలో.. ఎందుకిలా అనే పుస్తకం రాసిన ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
వైన్స్ వద్ద బైక్ చోరీ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వైన్స్ వద్ద నిలిపిన ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎస్సై రమాకాంత్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్ మంగళవారం రాచర్లగొల్లపల్లి శివారులోని వైన్స్ వద్ద బైక్ నిలిపాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి వా హనం కనిపించలేదు. బైక్ బ్యాగులో రూ.84 ఉన్నాయని, వాహనంతోపాటు డబ్బులను దుండగులు ఎత్తుకెళ్లారంటూ లబోదిబోమన్నాడు. పోలీస్‌స్టేషన్ కు వెళ్లి, ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
చోరీ కేసులో వ్యక్తికి జైలు
సిరిసిల్ల కల్చరల్/ముస్తాబాద్: చోరీ కేసులో ఓ వ్యక్తి కి మూడేళ్ల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పునిచ్చారు. వివరా ల్లోకి వెళ్తే.. గతేడాది మే 4న ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి పెద్దమ్మ గుడిలో అమ్మవారి పుస్తె, మెట్టెలు చోరీకి గురయ్యాయి. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామచంద్రం ము స్తాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వేములవాడ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన శివరాత్రి సంపత్‌ను అరెస్టు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ సందీప్ కేసు వాదించారు. కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీందర్ నాయుడు, కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో మంగళవారం సంపత్‌కు జడ్జి శిక్ష ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment